నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్

SMTV Desk 2018-09-28 12:19:55  Aravinda Sametha, Trivikram,

ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబోలో వస్తున్న అరవింద సమేత ఈ ఇయర్ వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటని చెప్పొచ్చు. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఆడియోలో కేవలం నాలుగు సాంగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆడియో ఓకే అనేలా ఉన్నా సినిమాలో మరీ నాలుగు పాటలేనా అంటూ ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. అందుకే వారి కోసం ఓ సడెన్ సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. సినిమాలో ఎన్.టి.ఆర్ డ్యాన్సింగ్ నెంబర్ గా ఓ క్రేజీ సాంగ్ ఉంటుందట. అది ఆడియోలో మిస్ చేశారు. డైరెక్ట్ గా సినిమాలోనే చూడాల్సిందని అంటున్నారు. కచ్చితంగా ఇది నందమూరి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ అన్నట్టే. దసరా కానుకగా వస్తున్న అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. టెంపర్ నుండి జై లవ కుశ వరకు సంచనలాకు సృష్టిస్తున్న తారక్ రాబోయే ఈ సినిమాతో ఇంకెన్ని రికార్డులు కొడతాడో చూడాలి.