ఇన్ఫోసిస్ లో రాజీనామాల పర్వం

SMTV Desk 2017-07-19 13:52:22  infosis, rithikaa suri, sandeep, job resignation, ceo,

న్యూ ఢిల్లీ, జూలై 19 : సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ లో ఉద్యోగుల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. గత నెల ఇన్ఫోసిస్ అమెరికా మార్కెట్ హెడ్ సందీప్ దడ్లానీ రాజీనామా సమర్పించగా, తాజాగా ఈ జాబితాలోకి ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితికా సూరి చేరారు. రితికా కంపెనీలో భారీ డీల్స్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. గతంలో ఎస్ఏపీలో పనిచేసిన రితికాను ఇన్ఫోసిస్ సీయీవో విశాల్ సిక్కా ఈ సంస్థలోకి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్ కు చెందిన ఆటోమేషన్ టెక్నాలజీ కంపెనీలో పనయా కొనుగోలు చేయడంలో రితికా కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్ 2014లో ఇన్ఫోసిస్ లో చేరిన ఆమె ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పదోన్నతి పొందారు. కాగా గత వారమే రితిక రాజీనామా సమర్పించిందని, ప్రస్తుతం నోటీసు పీరియడ్ లో ఉందని సమాచారం.