భారత్ హ్యట్రిక్

SMTV Desk 2018-09-22 15:35:07  India, Asia cup, Bangladesh,

ఆసియా కప్ లో భారత్ హ్యట్రిక్ కొట్టింది. అద్భుతమైన ఆటతీరుతో సూపర్ ఫోర్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 173 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే గేమ్ పూర్తి చేసిన భారత్ విజయతీరాలను చేరింది. ఒకానొక సందర్భంలో ఎంఎస్‌ ధోనీ (33; 37 బంతుల్లో 3×4) కూడా రోహిత్‌కు తోడుగా నిలిచి మ్యాచ్‌ను రక్తి కట్టించారు. బౌలర్లలో అప్పటికే జడేజా (4 వికెట్లు), భువి (3 వికెట్లు), బుమ్రా (3 వికెట్లు) తీయడంతో బంగ్లాదేశ్ తీవ్రమైన కష్టాల్లో చిక్కుకుపోయింది. బంగ్లా బ్యాట్స్‌మన్‌లో మెహది హసన్‌ (42 పరుగులు), మొర్తజా (26 పరుగులు) మాత్రమే కొంతలో కొంత నయం అనిపించారు.