విజయ్ స్థానంలో ధావన్

SMTV Desk 2017-07-19 13:19:45  Dhawan, replaces, Vijay

న్యూఢిల్లీ, జూలై 19 : శ్రీలంక పర్యటనకు వెళ్ళక ముందే కోహ్లి సేనకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 26 శ్రీలంక తో మొదలు కానున్న టెస్టు సీరీస్ కు ఓపెనర్ మురళీ విజయ్ గాయం కారణంగా దూరమయ్యారు. సోమవారం జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సెలక్షన్ కమిటి మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ ను ఎంపిక చేసింది. స్వదేశంలో ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో విజయ్ కుడి మణికట్టుకు గాయమైంది. పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం విజయ్ కి చెప్పింది. దీంతో విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ ను తీసుకున్నామని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పర్యటనలో భారత్ 3 టెస్టులు, 5 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ లు ఆడనుంది.