బుల్లితెరపై హంగామా

SMTV Desk 2018-09-21 12:51:18  Vishal, Hangama,

ఈ మధ్య స్టార్‌ హీరోలంతా … బుల్లి తెరలపై కనిపించేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మెగస్టార్‌ చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్‌, కమల్‌ హాసన్‌, మోహన్‌ లాల్‌, సూర్య లాంటి హీరోలు బుల్లితెరపై కనిపించి అభిమానులను సంతోషపరిచారు. మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్‌బాస్‌ లాంటి షోలతో పెద్ద హీరోలు బుల్లితెరపై హంగామా చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి విశాల్‌ కూడా జాయిన్‌ అవ్వబోతున్నాడు. నడిగర్‌ సంఘం కార్యదర్శిగా, నిర్మాతగా, నటుడిగా బిజీగా ఉన్న విశాల్‌.. తాజాగా ఓ షోతో బుల్లితెరను పలకరించబోతున్నారు. తెలుగులో పాపులర్‌ అయిన ‘మేము సైతం’ కార్యక్రమంలాంటి షోను తమిళ్‌లో విశాల్‌ హోస్ట్‌ చేయబోతోన్నాడు. సెలబ్రెటీలు సామాన్యులుగా మారి సంపాదించే డబ్బును చారిటీలకు ఇచ్చేలా షోను డిజైన్‌ చేయబోతున్నారు నిర్వాహకులు. సన్‌ టీవీలో ప్రసారం కానున్న ఈ షో త్వరలోనే ప్రారంభంకానుంది.