సమంత నటి మాత్రే కాదు మానవతా వాది

SMTV Desk 2018-09-18 18:52:04  samantha, kavitha, MP Kavitha

సమంత లీడ్ రోల్ గా పవన్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా యూటర్న్. వినాయక చవితి సందర్భంగా రిలీజైన ఈ సినిమా మెసేజ్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ గా అందరిని అలరిస్తుంది. పోటీగా నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ అవుతున్నా సమంత ఈ కథ మీద ఉన్న నమ్మకంతో యూటర్న్ రిలీజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో తెలంగాణా ఎంపి కవిత హాజరవడం జరిగింది. యూటర్న్ సినిమా తాను చూశానని అద్భుతంగా ఉందని.. మూవీ ద్వారా సమాజానికి ఇచ్చిన మెసేజ్ వెలకట్టలేనిదని అన్నారు. సినిమా చూశాక ప్రజల్లో మార్పు వచ్చిందని.. యూటర్న్ తీసుకునేందుకు భయపడుతున్నారని అన్నారు కవిత. ఇక నేటి ఆధునిక మహిళకు సమంత బెస్ట్ ఎక్సాంపుల్ అంటూ సమంతను ఆకాశానికెత్తేశారు కవిత. సమంత నటి మాత్రే కాదు మానవతా వాది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమందిని సేవ్ చేస్తుందని.. తెలంగాణా హ్యాండ్లూంస్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణా చేనేతకు గుర్తింపు తెచ్చారని అన్నారు. ఇక భార్యాభర్తల మధ్య పోటీ గురించి కూడా ప్రస్థావించారు కవిత.. ఒకేరోజు నాగ చైతన్య, సమంత సినిమాలు రిలీజ్ అయ్యాయని తెలిసింది. రెండు సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవడం పట్ల ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంటా బయట ఈ ఇద్దరికి ఆరోగ్య కరమైన పోటీ ఉందని భావిస్తున్నా అంటూ సమంతకు సెటైర్ వేశారు కవిత.