హైకోర్టు బ్రేక్

SMTV Desk 2018-09-18 17:30:07  Mundasthu ennikalu, High court,

ముందస్తు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ సోమవారం దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. ముందస్తు ఎన్నికల కోసమే ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితా తుది గడువును కుదించిందని అదిసరికాదని, కనుక జాబితా ఖరారు అయ్యే వరకు ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నిన్న ఒక పిటిషన్ దాఖలైంది. దానిపై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు, ఓటర్ల జాబితాలను సిద్దం చేయడం ఎన్నికల కమీషన్ బాధ్యత అని, ఆవిషయంలో దానికి విశేషానుభవం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు ఎలా నిర్వహించాలో ఎన్నికల కమీషన్ చూసుకొంటుందని, దాని పనిలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం సరికాదని చెపుతూ ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగేళ్లలో హైకోర్టులో టిఆర్ఎస్‌ సర్కారు చాలా ఎదురుదెబ్బలు తింది కానీ ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. డిల్లీలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్దం అవుతోంది. ముందస్తు ఎన్నికలపై సుప్రీం కోర్టు ఏమి చెపుతుందో చూడాలి.