24 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు

SMTV Desk 2017-07-19 10:47:08  Group -1 Re-Examinations, Interviews, 24th july

హైదరాబాద్, జూలై 19: టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2011 గ్రూప్-1 రీ ఎగ్జామినేషన్‌లకు సంబంధించిన ఇంటర్వ్యూలను ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీని పూర్తి షెడ్యూలును త్వరలో విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1 ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూల్లో ఏ శాఖకు సంబంధించిన పోస్టుల భర్తీకి ఆ శాఖాధిపతులు హాజరు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ సింగ్ మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శాఖాధిపతిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి(కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో ఎవరుంటే వారు) టీఎస్‌పీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డుకు హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు.