జీఎస్టీ స్పూర్తి తో: మోదీ

SMTV Desk 2017-07-18 17:27:33  Prime Minister, of, India, with, the, GST

న్యూఢిల్లీ, జూలై 18 : ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ స్పూర్తితో బలమైన సమైక్యతత్వం పెరిగి పార్లమెంట్ లో ఉత్సాహం వెల్లివిరుస్తుందని మోదీ అన్నారు. రాజకీయ పక్షాల ఉన్నత ప్రమాణాలతో కూడిన చర్చ జరిపి పార్లమెంటులో విలువను పెంచగలవని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష వ్యక్తం చేసారు. ప్రస్తుతం వర్షాకాల సమావేశాలకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని కొత్త రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఎన్నుకున్నామని గుర్తుచేశారు. వచ్చే ఆగస్టు 15 నాటికి దేశ స్వాతంత్రానికి ఏడు దశాబ్దాలు వస్తాయని అన్నారు. సోమవారం పార్లమెంటులోనికి ప్రవేశించే ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని పార్టీలకు ఆయన సూచించారు. అనంతరం లోక్ సభలోకి ప్రవేశించి వివిధ పార్టీల నేతలకు పేరుపేరున పలకరించి అందరికి అభివాదం చేసారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా కి నమస్కారం చేసారు. సమాజ్ వాది పార్టీ ములాయంసింగ్ యాదవ్, కాంగ్రెస్ సభ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేల దగ్గరకు వెళ్లి కరచాలనం చేసారు. రెండో వరుసలో కూర్చున్న రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా లను పలకరించారు. అనంతరం తొలిరోజు వర్షాకాల సమావేశాల పార్లమెంటు ఉభయ సభల్లో ఇటీవల కన్నుమూసిన రాజ్య సభ సిట్టింగ్ సభ్యులు కేంద్ర మంత్రి అనిల్ మాధవ్ దవే, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి దాసరి నారాయణ రావు, మాజీ సభ్యులు డాక్టర్ సీ నారాయణరెడ్డి తదితరులకు నివాళి అర్పించి పార్లమెంట్ తొలి రోజు సభ వాయిదా పడింది.