లండన్‌లో సానియా దంపతులు...

SMTV Desk 2017-07-18 16:22:41  SAANIA MEERJAA, SHOYAB MAALIK, MARRAGE, PHOTOS, TENNIS, CRIKET, SOCIAL MEDIA.

లండన్, జూలై 18 : భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రస్తుతం లండన్ లో తన భర్త షోయబ్‌ మాలిక్‌తో కలిసి చక్కర్లు కొడుతోంది. వింబుల్డన్‌ టోర్నీలో మిక్స్‌డ్‌ డబుల్స్‌, మహిళల డబుల్స్ లో పాల్గొన్న సానియా ప్రిక్వార్టర్స్‌లోనే నిష్క్రమించింది. కాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కాస్త విరామం దొరకడంతో షోయబ్ మాలిక్.. సానియాతో కలిసి సరదాగా గడపడానికి లండన్‌లో ఓ పెళ్లికి హాజరైనట్లు సమాచారం. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సానియా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం జహీర్‌ ఖాన్‌- సాగరిక, ఆశిష్‌ నెహ్రా, అజహార్‌ మొహమ్మద్ కూడా లండన్‌లోనే ఉండగా ఆ క్రీడాకారులంతా కలిసి దిగిన ఫొటోని సానియా తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.