ఆర్మీ మేజర్‌ ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌

SMTV Desk 2017-07-18 15:32:37  ARMY, JAVAAN, MEJOR, RILES BREAK, MOBILE PHONES, SENSITVE AREA, AK-47.

శ్రీనగర్, జూలై 18 : విధులు నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులు భద్రత పరంగా మొబైల్ ఫోన్స్ వాడకూడదు అనే నియమం ఉంది. ఓ ఆర్మీ జవాన్ ఈ పద్దతిని అతిక్రమించగా ఆగ్రహించిన ఉన్నతాధికారిపై కాల్పులు జరిపాడు. వివరాలలోకి వెళితే.. జమ్మూకశ్మీర్ లోని ఉరి సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్న ఓ జవాను సెల్ ఫోన్ వినియోగించడంపై మేజర్‌ శిఖర్‌ తాపా గుర్తించి ఇలాంటి సున్నితమైన ప్రాంతాలలో సెల్ ఫోన్ వినియోగించరాదని హెచ్చరించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని జవాన్ నుంచి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి పెనుగులాటకు దారి తీసింది. దీంతో ఫోన్ కింద పడిపోగా ఆగ్రహానికి గురైన జవాన్ తన చేతిలోని ఏకే-47 ఆయుధాన్ని తీసుకొని మేజర్‌పై కాల్పులు జరపగా అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. ఆ జవానును అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.