హైదరాబాద్ లో భారీ వర్షం

SMTV Desk 2017-07-18 14:05:43  Hyderabad, himayathnagar,bhollaram,chilakadaguda,

హైదరాబాద్ ,జూలై 18 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారి వర్షం సంచలనం. నగరంలో ఎడతెరిపి లేకుండా ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. ఎక్కడికి అక్కడే కాలనిల్లో నీటితో నిండిపోయాయి వర్షం కారణంగా నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భేగంబజార్, సుల్తాన్‌ బజార్, కోఠి,అబిడ్స్,నాంపల్లి , బషీర్‌బాగ్‌,లక్డికపూల్ ,నారాయనగూడ, హిమాయత్‌నగర్‌లో ఉదయం నుండి భారీ వర్షం కురిసింది.ఎంజే మార్కెట్, బషీర్‌బాగ్‌ ప్రాంతాల్లో రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. దీంతో పాటు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మొండా మార్కెట్, పార్శీ,గుట్ట మధురానగర్ ,వారాసిగూడ ,చిలకలగూడ ,పద్మారావు నగర్, మారెడ్‌పల్లి అడ్డగుట్ట,బేగంపేట్, బోయిన్‌పల్లి,తిరుమలగిరి,అల్వాల్‌,బొల్లారం, జవహర్‌నగర్‌, బాలాజీనగర్‌, యప్రాల్‌ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలైన వారాసిగూడ, మధురానగర్‌, న్యూ అశోక్‌నగర్‌ కాలనీల్లో రహదారులు నీటితో నిండాయి. వర్షం కారణంగా పలు చోట్ల, చెట్లు ఇల్లు కూలిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి