హాలీవుడ్ లోకి "కాబిల్"

SMTV Desk 2017-07-18 13:21:36  hollywood, hruthik roshan, yami gowtham, sanjay guptha, remake, kaabil movie.

ముంబై, జూలై 18 : హాలీవుడ్ చిత్రాలను సాధారణంగా హిందీలో రీమేక్ చేస్తుంటారు. కాని తొలిసారి ఓ హిందీ చిత్రం హాలీవుడ్ లో రీమేక్ కానుంది. ఆ సినిమా "కాబిల్" సంజయ్‌ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌, యామి గౌతమ్‌ జంటగా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించగా ఇప్పుడు ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయనున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ సంజయ్ గుప్తా మీడియా ద్వారా వెల్లడిస్తూ.. ఈ చిత్రాన్ని హాలీవుడ్ లో రీమేక్ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్ని అనుకున్నట్లు జరిగితే హాలీవుడ్ లో రీమేక్ కానున్న తొలి హిందీ చిత్రం మాదే అవుతుందని తెలిపారు. "ఫాక్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అధ్యక్షుడు థామస్‌ కాబిల్‌" ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. ప్రస్తుతం హృతిక్‌ న్యూయార్క్‌ లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి రాగానే ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ రాకేష్ రోషన్ తో చర్చించి అధికారికంగా వెల్లడించనున్నారు.