టీఆర్‌ఎస్‌తో ఎలాంటి లోపాయికారి పొత్తులు లేవు. ఎంపీ దత్తాత్రేయ

SMTV Desk 2018-09-10 16:00:19  BJP MP Dttatreya, CM KCR TRS, Telangana Elections

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌తో ఎలాంటి లోపాయికారి పొత్తులు లేవని ఎంపీ దత్తాత్రేయ అన్నారు. తెరాస ముందస్తుకు వెళ్లడం తొందరపాటు చర్య అని, ప్రజా క్షేత్రంలో కేసీఆర్ కు భంగ పాటు తప్పదని అన్నారు. బీజేపీ త్వరలో తెలంగాణాలో ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. . గత ఎన్నికల్లో మాజీ ప్రధాని వాజ్‌పేయి, ఇప్పటి మోదీ వల్లే చంద్రబాబు గెలిచారని గుర్తుచేశారు. బీజేపీని తిడితే ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారని, తిట్టడం వల్ల ఓట్లు పడవని దత్తాత్రేయ పేర్కొన్నారు.రెండు తెలుగు రాష్టాలలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని అన్నారు.