రూ . 90కి చేరువలో పెట్రోల్‌ ధర

SMTV Desk 2018-09-10 12:06:30  Congress Bharat Bhand, Rahul gandi, Congress Chiff, New Delhi, Rajastan governament,

* దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న భారత్ బంద్ * 4 శాతం వ్యాట్ ను తగ్గించిన రాజస్థాన్ ప్రభుత్వం భారత్ బంద్ సందర్బంగా రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై 4 శాతం వ్యాట్ ను తగ్గించింది. ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా విపక్షాలు ఇచ్చిన బంద్ కొనసాగుతుండగా పెట్రోల్, డీజిల్ ధరలు రూ . 90కి చేరువ అవుతుంది.. దేశరాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌పై 23 పైసలు, డీజిల్‌పై 22 పైసలు పెరిగింది. దీంతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.73, డీజిల్‌ రూ.72.83గా ఉంది. ఇక అత్యధికంగా ధరలు ఉండే ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.88.12కి చేరగా.. డీజిల్‌ ధర రూ.77.32గా ఉంది. ఇక హైదరాబాద్‌లో నేడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 85.60, డీజిల్‌ ధర రూ. 79.22గా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తోంది. ఇక ఆయా రాష్ట్రాల్లో వీటిపై వ్యాట్‌ కొనసాగుతోంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వ్యాట్‌ తక్కువగా(6 శాతం) ఉంది. దేశ వ్యాప్తంగా బంద్ బంద్ విజయవంతంగా కొనసాగుతుందని రానున్న ఎన్నికల్లో బీజీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు.