వెంకటేష్, త్రివిక్రం సినిమా రాబోతుంది

SMTV Desk 2018-09-08 18:49:48  Venkatesh, Trivikram, Mallishwari

రైటర్ గా ఉన్నప్పుడే త్రివిక్రం టాలెంట్ మెచ్చిన వెంకటేష్ దర్శకుడిగా మారాక వెంకటేష్ తో పనిచేసే అవకాశం రాలేదు. ఇద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నా సినిమా చేసేందుకు టైం కలిసి రాలేదు. ప్రస్తుతం త్రివిక్రం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఖాళీనే అని తెలుస్తుంది. ఇక వెంకటేష్ కూడా ఎఫ్-2, వెంకీ మామా సినిమాలు పూర్తి చేశాక ఫ్రీ అవనున్నాడు. వెంకటేష్, త్రివిక్రం కలిసి ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. ఎన్నాళ్ల నుండో అనుకుంటున్న ఈ కాంబినేషన్ వచ్చే ఏడాది ఫిక్స్ అవుతుందని తెలుస్తుంది. ఈమధ్యనే వెంకటేష్ బర్త్ డే నాడు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఓ పోస్టర్ కూడా వేశారు. కాబట్టి త్రివిక్రం డైరక్షన్ లో వెంకటేష్ హీరోగా సినిమా కన్ ఫాం అని తెలుస్తుంది. త్రివిక్రం మాటలతోనే సూపర్ హిట్ అందుకున్న వెంకీ ఇక ఆయన డైరక్షన్ లో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.