ఉద్యోగులను మోసం చేసిన కేసీఆర్

SMTV Desk 2018-09-08 18:26:47  DK Aruna, Congress Leader, CM KCR, Tealangana Election

* టీఆర్ఎస్‌లో మహిళలకు అన్నీ అవమానాలే * కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ హైదరాబాద్: ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పిఉద్యోగులను కేసీఆర్ మోసం చేసారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. టీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీ.. మహిళా వ్యతిరేక పార్టీ అని, కొండా సురేఖకు టీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. టీఆర్ఎస్‌లో మహిళలకు అన్నీ అవమానాలే మిగిలాయన్నారు. టీఆర్ఎస్ నిర్వహించిన హుస్నాబాద్ సభ కూడా వెలవెలబోయిందని విమర్శించారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పి.. కేసీఆర్ వారిని దారుణంగా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు డీకే అరుణ పిలుపునిచ్చారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కేసీఆర్ కు గుణపాఠం తప్పదని అన్నారు.