త్వరలో అమీర్‌పేట్‌-ఎల్బీనగర్‌ మెట్రోలైన్‌ ప్రారంభం

SMTV Desk 2018-09-08 14:36:36  Ameerpet to LB Nagar, Metro line, Hyderabad, KCR, KTR, TRS, NVS Reddy, metro MD

హైదరాబాద్ : నగర వాసులు ఇప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న అమీర్ పేట్ -ఎల్బీనగర్‌ మెట్రోలైన్‌ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి దశలో నాగోల్ నుండి మియాపూర్ వరకు ప్రారంభించినప్పటి నుండి ఆ రూట్లో కొంత వరకు రద్దీ తగ్గింది. దీంతో మిగితా రూట్లలో మెట్రోలైన్ నిర్మాణాలను వేగవంతం చేసారు. ఈ రోజు ఉదయం నాంపల్లిలో మెట్రో మల్టీ లెవల్‌ పార్కింగ్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్‌ జోషి, మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ అమీర్‌పేట్‌ నుంచి ఎల్బీనగర్‌ మెట్రోలైన్‌ ఈ నెలలోనే ప్రారంభమవుతుందని అన్నారు. మెట్రో సేఫ్టీ పరీక్షలు జరుగుతున్నాయని, చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్‌ రాలేదని…కాబట్టి సీఎం కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ చేతుల మీదుగా అమీర్‌పేట్‌, ఎల్బీనగర్‌ మెట్రోలైన్‌ ప్రారంభం ఉంటుందని తెలిపారు. ఈ మార్గం పూర్తయితే అమీర్ పెట్ నుండి ఎల్బీనగర్‌ వరకు కొంత ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంది.