బ్రిటిష్ ఎయిర్ వేస్ పై హ్యాకర్ల పంజా

SMTV Desk 2018-09-08 14:10:25  British Airways, KCR, hacker, Credit cards hacked

ప్రముఖ విమానయాన సంస్థ బ్రిటిష్ ఎయిర్ వేస్ కు హ్యాకర్లు షాకిచ్చారు. కంపెనీ వెబ్ సైట్, మొబైల్ యాప్స్ పై దాడిచేసిన హ్యాకర్లు 3.8 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను చోరీ చేశారు.ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు సంస్థ మొబైల్‌ యాప్‌ ద్వారా, ఎయిర్‌వేస్‌ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసిన 3.8లక్షల ప్రయాణికుల క్రెడిట్‌ కార్డు వివరాలు చోరీఅయ్యాయని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ఈ వివరాలు దుర్వినియోగంకాకుండా ఆపేందుకు యత్నిస్తున్నామని బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో అలెక్స్‌ క్రూజ్‌ చెప్పారు. పోలీసుల విచారణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై బ్రిటిష్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేశామనీ, వారు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని క్రూజ్ పేర్కొన్నారు. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 5 వరకూ తమ వెబ్ సైట్, యాప్స్ నుంచి క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసుకున్నవారు వెంటనే తమ కార్డులను బ్లాక్ చేయాలని సూచించారు.