సొంత గూటికి కొండా దంపతులు

SMTV Desk 2018-09-08 11:00:59  Konda Surekha, TRS, Konda Surekha to jion congress

* తెరాస నుండి టికెట్ రాకపోవడమే కారణం హైదరాబాద్: తెరాస ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో వారు కాంగ్రెసులోకి చేరుతున్నట్లు సమాచారం. గతంలో వరంగల్ తూర్పు నుండి పోటీ చేసి గెలిచారు. ఈ సరి కూడా అక్కడినుండి సీటు ఆశించారు. అంతేకాక తమ కుమార్తెకు భూపాలపల్లి టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. దానికి కేసీఆర్ సుముఖంగా లేరని అంతేకాక వరంగల్ మేయర్ నరేందర్, కొండా సురేఖకు మధ్య కొన్ని గొడవలు జరిగాయి. ఈ విషయం కేసీఆర్ దగ్గరకు కూడా వెళ్లినట్లు సమాచారం. ఈ కారణాల వల్లనే వరంగల్ తూర్పు సీటు పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మధ్యాహ్నం 12గంటలకు వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా తెరాసను వీడుతున్నట్లు ప్రకటించే అవకాశముంది. అనంతరం 12న కాంగ్రెస్‌ సీనియర్‌నేత ఆజాద్‌ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.