మరో యువతిపై యాసిడ్ దాడి...

SMTV Desk 2017-07-18 10:38:36  PET BHASHEERBHAADH, ACID, LOVE, TOURCHER, ACID ATTACK, HOSPITAL.

పేట్‌ బషీరాబాద్, జూలై 18 : అమ్మాయిలపై రోజు రోజుకి దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎన్ని నిర్బయ కేసులు పెట్టిన ఎంతగా శిక్షించిన దుర్మార్గులు ఇంకా దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి పరిణామం వల్ల మరో యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని దత్తాత్రేయ నగర్‌లో నివాసముండే ముర్తుజా చిరువ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆయన మూడో కుమార్తె కబీరా బేగం (22) సుభాష్‌ నగర్‌లోని ఓ ఫ్యాన్ల పరిశ్రమలో పనిచేస్తుండగా, అదే పరిశ్రమలో ప్రదీప్‌ అనే యువకుడు కూడా పనిచేస్తున్నాడు. ఈ నేపధ్యంలో తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కబీరాను కొన్నాళ్లుగా వేధిస్తున్నాడు. కబీరా ఒప్పుకోకపోవడంతో కోపం పెంచుకున్న ప్రదీప్ నిన్న రాత్రి కబీరా బయటకు రాగానే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమె ముఖంపై పోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన కబీరాను గమనించిన స్థానికులు వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.