ముందస్తు ఎన్నికలంటే గోడలు గీకుతున్నారు

SMTV Desk 2018-09-07 18:23:38  Husnabad, TRS Meeting, KCR

* కరువుకు మూలకారణం కాంగ్రెస్‌ పార్టీనే. * తెరాస వల్లనే రాష్ట్రం అభివృద్ధి. * అధికారంలోకి వస్తే అల్ప ఉద్యోగుల జీతాలు పెంచుతాం. * కాంగ్రెస్ నేతలేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా? * హుస్నాబాద్ సభలో కేసీఆర్ హుస్నాబాద్ : ముందస్తు ఎన్నికలంటే కాంగ్రెస్, బీజీపీ నాయకులు గోడలు గీకుతున్నారని, బెంబేలెత్తిపోయి ఢిల్లీకి పరుగెత్తుతున్నారని ఆపధ్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై పలు విమర్శలు చేసారు. అధికారం లేక ఆకలితో ఉన్నారని వారికీ అధికారం అప్పగిస్తే పంటికిందికి రాకుండా అందినకాడికి దోచుకుంటారని అన్నారు. . రాష్ట్రంలోని పేదరికానికి కాంగ్రెస్ పార్టీ కారణం కాదా? కాంగ్రెస్ నేతలేమైనా గంధర్వులా? పైనుంచి దిగి వచ్చారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని... ఈ అభివృద్ధి కాంగ్రెస్ నేతలకు కనిపించడం లేదా? అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకంటే వేగంగా జరుగుతాయని అన్నారు. ఈ సంధర్బంగా హుస్నాబాద్ అభ్యర్థి సతీష్ బాబుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.