మిథాలీ కి సచిన్ సందేశం

SMTV Desk 2017-07-18 09:52:15  mithaali raaj, sachin tendulkar, instaagraam, post, cricket, athlet, india.

న్యూఢిల్లీ, జూలై 18 : భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను ప్రశంసలతో ముంచెత్తారు క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మిథాలీ కెరీర్‌కు సంబంధించిన ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు. అందులో ఎనిమిదేళ్ల వయసులో ఆలస్యంగా నిద్రలేచే మిథాలీ అలవాటును మాన్పించేందుకు తండ్రి దొరైరాజ్‌ ఆమెను క్రికెట్‌ అకాడమీలో చేర్పించడాన్ని సచిన్‌ ప్రస్తావించాడు. కాని ఆ వయస్సులో మిథాలీ మహిళల క్రికెట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొడుతుందని ఎవరు ఊహించలేదని చెప్పారు. "ప్రతిభను సానబెట్టి సరైన దిశలో నడవడమే కీలకం. మిథాలీ.. నువ్వు ఒక గొప్ప అథ్లెట్ వి నువ్వు మైదానం లో ఆడుతున్నప్పుడు చూడడం మాకు గొప్ప అనుభూతి. ఇలాంటి జోరునే కొనసాగించు. కమాన్ ఇండియా" అంటూ సందేశాన్ని పోస్ట్ చేశారు.