బాలీవుడ్‌లోకి స్టయిలిష్ స్టార్ ఎంట్రీ

SMTV Desk 2018-09-07 13:30:21  Bollywood, Stylish Star, Bollywood Biopic,

‘నా పేరు సూర్య’ తర్వాత స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. తర్వాతి ప్రాజెక్ట్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. అయితే బన్నీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని, అందుకే తదపరి సినిమా విషయంలో ఎలాంటి ప్రకటనా చేయడం లేదని సమాచారం.నీరజ్ పాండే దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా కపిల్ దేవ్ జీవితంపై తెరకెక్కుతున్న ‘83’ బయోపిక్‌లో అల్లు అర్జున్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. ఈ మూవీలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో బన్ని కనిపించబోతున్నాడని సమాచారం. ఒకవేళ అల్లు అర్జున్ ఈ మూవీకి ఓకే చెబితే...అతను హిందీలో చేసే ఫస్ట్ మూవీ ఇదే అవుతోంది.