కేసీఆర్ భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు

SMTV Desk 2018-09-07 13:04:16  AP CM Chanrababunaidu, TDP, KCR

ప్రధాన విపక్షం కాకున్నా టీడీపీపై ఎందుకంత ద్వేషం : చంద్రబాబు అమరావతి: తెలంగాణాలో టీడీపీ ప్రధాన విపక్షం కాకున్నా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బీజేపీ, తెరాస రెండు కలిసే పనిచేస్తున్నాయని అందువల్లే తెలంగాణ బిల్లులను త్వరగా పరిశీలించిన కేంద్రం ఆంధ్రప్రదేశ్ పై వివక్ష చూపుతున్నారని అన్నారు. టీడీపీని, తనను బూచిగా చూపించి ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ యోచిస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలోనూ మోదీ-షాల వ్యూహం దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వారి వ్యూహాన్నే కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల ప్రజలు కలిసి ఉండాలనేదే తన అభిప్రాయమని ఈ సందర్బంగా చంద్రబాబు అన్నారు.