మను మూవీ రివ్యూ

SMTV Desk 2018-09-07 12:56:49  manu Movie review, Manu Movie,

మను మూవీ రివ్యూ తారాగ‌ణం: గౌతమ్, చాందిని చౌదరి, శ్రీకాంత్‌, జాన్ కొట్టొలి, మోహ‌న్ భ‌గ‌త్, అభిరామ్ వ‌ర్మ త‌దిత‌ర‌లు. రచన & దర్శకత్వం: ఫణింద్ర నర్సెట్టి నిర్మాత‌లు: చిత్ర యూనిట్‌తో పాటు 115 మంది (క్రౌడ్ ఫండింగ్ మూవీ) మ్యూజిక్: నరేష్ కుమ‌రన్ కెమెరామెన్: విశ్వనాధ్ రెడ్డి సెట్ డిజైన్: శివ కుమార్ సౌండ్ డిజైన్: సచిన్ సుధాకరన్, హరిహారన్ (ఎస్.వై.ఎన్. ఎస్ సినిమా) లైన్ ప్రొడ్యూసర్: కార్తీక్ శబరీష్ స్టోరీ.. మను (రాజా గౌతమ్‌) ఓ చిత్రకారుడు. ఏదో విషయంలో తనలో తానే మధనపడుతుంటాడు. నీల (చాందినీ చౌదరి) మనుని ఇష్టపడుతుంది. తన కళని ఆరాధిస్తుంది. అయితే అనుకోని పొరపాటు వల్ల మనుని అపార్థం చేసుకుంటుంది. దాన్ని తెలుసుకుని మనుకి దగ్గరయ్యే క్రమంలో ఆమె జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవేంటి? మను, నీల కలశారా? వీరిద్దరికీ ఓ వజ్రానికీ ఉన్న సంబంధం ఏమిటి? అనేది తెరపై చూడాలి. * న‌టీన‌టులు సినిమాలో క‌నెక్ట్ అయిన‌ప్పుడు.. క‌థ అర్థ‌మ‌వుతూ సాగుతున్న‌ప్పుడు… న‌టీన‌టుల ప్ర‌తిభ‌, సాంకేతిక ప‌నిత‌నం వ‌గైరాల గురించి ఆలోచిస్తాం. కానీ ద‌ర్శ‌కుడు ఇక్క‌డ ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. అస‌లు క‌థేంటో, ఎందుకు ఎటుపోతుందో… అర్థం కాక‌… ఆ లాజిక్కులు మ‌నసులోనే వేసుకుంటూ చూడ‌డం వ‌ల్ల‌.. తెర‌పై న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ గుర్తించేంత తీరిక ఉండ‌దు. తెర‌పై బొమ్మ చూస్తున్నా… లోలోప‌ల ఎన్నో ప్ర‌శ్న‌లు స‌మాధానాల కోసం ఆవురావురుమంటుంటాయి. అందుకే తెర‌పై ఇంకేం క‌నిపించ‌దు. అయితే ప్ర‌తీ పాత్ర‌.. త‌న నుంచి ద‌ర్శ‌కుడు ఏం కావాల‌నుకుంటున్నాడో అదే ఇచ్చింది. గౌత‌మ్‌… కొత్త‌గా క‌నిపించాడు. బ‌హుశా గ‌డ్డం వ‌ల్ల‌నేమో. అత‌ని డైలాగ్ డెలివ‌రీ బాగుంది. విల‌న్ గ్యాంగ్‌లో అంతా కొత్త‌వారే. * సాంకేతిక వ‌ర్గం ఈ క‌థ‌ని ఫ్లాట్‌గా చెప్పి ఉంటే… క‌నీసం ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌య్యేది. స్క్రీన్ ప్లే నైపుణ్య‌మంతా ప్ర‌ద‌ర్శించాల‌ని చూడ‌డంతో… గంద‌రగోళం మొద‌ల‌య్యింది. డైలాగుల్లో డెప్త్ ఉంది. ఈ సినిమాల్లో మాట‌లు చాలా త‌క్కువ వినిపిస్తాయి. కానీ.. అందులోని భావాలు ఆక‌ట్టుకుంటాయి. కొన్ని మ‌రీ అర్థం కాకుండా ఉన్నాయి. ఆర్ట్ వ‌ర్క్ ఆక‌ట్టుకుంటుంది. అండమాన్ లాంటి దీవి నేప‌థ్యంలో, అది కూడా సెల్ ఫోన్లు లేని కాలంలో న‌డిచే క‌థ ఇది. ఆ ఫీల్‌ని రాబ‌ట్టుకున్నారు. నేప‌థ్య సంగీతంలోని కొన్ని థీమ్స్ హాంటింగ్‌గా ఉన్నాయి. ప్ల‌స్ పాయింట్స్ + ట్విస్టులు + లవ్‌ ట్రాక్‌ మైన‌స్ పాయింట్స్ – స్క్రీన్‌ ప్లే నిడివి