ఆంధ్రోళ్ల ఓట్లతో గెలవలేదా

SMTV Desk 2018-09-07 11:39:23  Nara Lokesh, Minister, Andrapradesh, TDP

* ఇప్పుడు జాగో, బాగో అంటున్నారు. * కేసీఆర్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు. అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. తెలుగువారు కలిసుందామంటూనే జాగో, బాగో అంటున్నారని ఇలాంటి వాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు. టీఆర్ఎస్‌లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత మంది ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. ఆంధ్రోళ్ల ఓట్లు వేయించుకుని గెలిచిన ఎమ్మెల్యేలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పక్కన కూర్చోబెట్టుకున్నారని మండిపడ్డారు. తెరాస ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో టీ టీడీపీ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణాలో ఎన్ని స్థానాలలో పోటీ చేయాలనే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.