కొండా సురేఖకు మొదటి లిస్టులో దక్కని చోటు

SMTV Desk 2018-09-06 18:11:46  Konda Surekha, TRS, KCR, TRS

హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో వరంగల్ తూర్పు నుండి కొండా సురేఖకు చోట దక్కలేదు. ఈ జాబితాలో 5 గురి స్థానాలను కేసీఆర్ సస్పెన్స్ లో ఉంచారు. మేయర్ నన్నపునేని నరేందర్‌, తాజా మాజీ స్పీకర్ మధుసూధనాచారి వర్గంతో గత కొన్ని రోజులుగా విభేదాలు ఉండటం వల్లనే టిక్కెట్టు కేటాయించలేదని వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొండా దంపతులు భూపాలపల్లిపైనా దృష్టి పెట్టడం వివాదాస్పదంగా మారింది. తన కూతురు సుస్మితా పటేల్‌ కోసం..భూపాలపల్లిపై దృష్టి పెట్టారనే ప్రచారం కూడా ఉంది. అందువల్లనే కొండా సురేఖ పేరును మొదటి లిస్టులో ప్రకటించలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.