105 అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

SMTV Desk 2018-09-06 15:25:00  CM KCR, Telangana

* ఇద్దరు అభ్యర్థులకు టిక్కెట్ల నిరాకరణ హైదరాబాద్: 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నామన్నారు. అభ్యర్థులందరితో క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆందోల్ బాబూమోహన్‌కు, చెన్నూర్ నల్లాల ఓదేలుకు మాత్రం సీట్లు ఇవ్వడం లేదని చెప్పారు. మేడ్చల్, మల్కాజ్ గిరి, చొప్పదండి, వికారాబాద్, వరంగల్ ఈస్ట్ స్థానాలను పెండింగ్ లో ఉంచామని చెప్పారు. మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వారి సీట్లను వారికే కేటాయించడం జరిగిందని చెప్పారు.