ముగిసిన టీ-కేబినెట్ భేటీ

SMTV Desk 2018-09-06 13:36:02  T cabinet meeting, assembly

ఊహాగానాలను నిజం చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీని రద్దు చేశారు.హైదరాబాద్ ప్రగతిభవన్ లో జరిగిన టీ-కేబినెట్ భేటీ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. అసెంబ్లీ రద్దుకు మంత్రి వర్గం ఏక వాక్య తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని తీసుకుని సీఎం కేసీఆర్, మంత్రులు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు అందజేయనున్నారు.