మంత్రులందరూ ప్రగతి భవన్ కు రావాలి

SMTV Desk 2018-09-06 12:29:38  CM KCR, TRS, Cabinet meeting

* మంత్రులు, ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ. * అసంతృప్త నేతలను బుజ్జగించే బాధ్యత కేటీఆర్ కు. హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను వెంటనే ప్రగతి భవన్ కు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రులందరికీ ఫోన్లు వెళ్లినట్టు సమాచారం. కొంత మంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. 12 గంటల్లోపు ప్రగతి భవన్ చేరుకోవాలని మంత్రులను సీఎం ఆదేశించగా... ఒంటిగంటలోపు ప్రగతి భవన్ చేరుకోవాలని ఎమ్మెల్యేలకు పిలుపు వెళ్లింది. మంత్రులతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి విడిగా భేటీ కానున్నారు. మరోవైపు టికెట్ల కేటాయింపుల్లో అసంతృప్తికి గురయ్యే నేతలను బుజ్జగించే బాధ్యతను కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఆశావాహుల మధ్య గొడవలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.