ఉత్కంఠకు నేడు తెర

SMTV Desk 2018-09-06 10:49:16  CM KCR, Gavarnar Narasimhan, TRS

* మధ్యాహ్నం 1:30కి గవర్నర్‌తో కేసీఆర్ భేటీ * 2 గంటలకు మీడియా సమావేశం హైదరాబాద్ :రాష్టంలో రాజకీయవర్గాల్లో గత కొన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకు నేడు తేర పడనుంది. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అరగంటపాటు జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. భేటీ ముగిసిన అనంతరం 1:30 గంటలకు సీఎం కేసీఆర్ రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ అపాయింట్‌మెంట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. గవర్నర్‌తో జరిగే అరగంట భేటీలో కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్ వివరించనున్నారు. అనంతరం రెండు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలను సీఎం వెల్లడించనున్నట్టు సమాచారం. అలాగే, ముందస్తు ఎన్నికలపై ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల్లో హడావుడి రోజు రోజుకి పెరుగుతుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం మాదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు.