నాని @ 10 ఇయర్స్

SMTV Desk 2018-09-05 19:41:58  Nani, Nani completes 10 years

ప‌క్కింటి అబ్బాయిలా ఎంతో నేచుర‌ల్‌గా క‌నిపించే నేచుర‌ల్ స్టార్ నాని. ఆర్జేగా, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరియ‌ర్ మొద‌లు పెట్టిన నాని 2008 సంవ‌త్స‌రంలో అష్టా చెమ్మా అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశాడు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొంద‌డంతో నానికి త‌ర్వాత మంచి ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. 2012లో వ‌చ్చిన ఈగ చిత్రం నాని తల రాత‌ని మార్చేసింది.రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈగ చిత్రంలో చేసింది కొద్ది సేపే అయిన నానికి మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఆ త‌ర్వాత వ‌రుస ఫ్లాపులు నానిని కిందకు లాగాయి..ఇక నాని పని అయిపోయినట్లే అనుకునే టైములో 2015లో మారుతి తెర‌కెక్కించిన భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఇక ఆ త‌ర్వాత నాని డ‌బుల్ హ్యాట్రిక్ విజ‌యాలు సాధిస్తూ అతి తక్కువ టైంలోనే టాప్ హీరో స్టేటస్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం దేవ‌దాస్ అనే చిత్రంలో నాగ్‌తో క‌లిసి మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక జ‌ర్సీ అనే చిత్రంతోను బిజీగా ఉన్నాడు నేచుర‌ల్ స్టార్‌. అయితే వెండితెర‌పైనే కాదు బుల్లితెర‌పైన త‌ను అల‌రించ‌గ‌ల‌న‌ని బిగ్ బాస్ 2 కార్య‌క్ర‌మంలో ప్రూవ్ చేశాడు నాని. బిగ్ బాస్ 2కి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న నాని త‌న‌దైన పంచ్‌ల‌తో జిమ్మిక్కులు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న నాని కెరీర్‌లో మ‌రెన్నో మంచి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తార‌ని కోరుకుందాం.