జైలుకు వెళ్లేందుకైనా సిద్దమే : మమతా బెనర్జీ

SMTV Desk 2017-07-17 18:33:13  Mamta, is, ready, to, go, to, jail

కోల్ కత్తా, జూలై 17 : మోదీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. జీఎస్టీ వస్తు సేవల పన్ను, పెద్దనోట్ల రద్దు పెద్ద కుంభ కోణం అని మమత అన్నారు. తను ఎవరికీ తల వంచనని ఇందుకోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్దమేనని ఆమె స్పష్టం చేసారు. బీజీపీ కి ఎవరు మద్దతు ఇవ్వొద్దని ఆమె అన్నారు. ఇందుకోసమే బీజేపి కి వ్యతిరేకంగా ఓటు వేశానని అన్నారు. దేశ సరిహద్దుల్లో అశాంతి నెలకొందన్నారు. ఎన్ఐఏ, ఇంటలిజెన్స్ సంస్థలు ఎక్కడ ఉన్నాయని మమత బెనర్జీ ప్రశ్నించారు.