ఎమ్మెల్యేలకు షాకిచ్చిన కేటీఆర్

SMTV Desk 2018-09-05 15:24:57  KTR, Assembly Cancel, KCR,

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖ‌రార‌య్యింది. గురువారం నాడు తెలంగాణ తొలి అసెంబ్లీ అనూహ్యంగా రద్దు కానుంది. మంగళవారం నాడు ఈ దిశగా పలు పరిణామాలు శ‌ర‌వేగంగా సాగాయి. ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఏక‌దాటిగా భేటీలు, సమావేశాలు, చర్చలు జరిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో నిన్న సాయంత్రం టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కాసేపు ఆయనతో ముచ్చటించిన తర్వాత మళ్లీ శుక్రవారం నాడు కలుస్తామంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్ కు చెప్పారు. వెంటనే కేటీఆర్ స్పందిస్తూ, శుక్రవారం కల్లా మీరు మాజీ ఎమ్మెల్యేలు అయిపోతారని చెప్పారు. కేసీఆర్ మాటలతో ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు. ఏం జరగబోతోందో వారికి పూర్తిగా అర్థమయిపోయింది. రేపు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.