ఫసక్ పై మోహన్‌బాబు ట్వీట్‌

SMTV Desk 2018-09-04 14:25:09  Fasak, Mohan Babu,

ఇటీవల ఓ ఇంగ్లిష్ ఛానెల్‌కు మోహన్‌బాబు, ఆయన కుమార్తె లక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా మోహన్‌బాబు డైలాగులు చెప్పే విధానం చర్చకొచ్చింది. డైలాగ్ డెలివరీలో ఎన్టీఆర్‌ను అనుసరించేవాడినని, గురువుగారు దాసరి ఇచ్చే విలువైన సూచనల్ని పాటిస్తూ డైలాగ్స్ చెప్పడంలో కింగ్‌లా పేరు తెచ్చుకున్నానని మోహన్‌బాబు చెప్పారు. మచ్చుకు ‘ఎం ధర్మరాజు ఎంఏ’ మూవీలో తను పోషించిన తండ్రీకొడుకుల పాత్రలకు సంబంధించి ఒక డైలాగ్‌ను ఇంగ్లిష్‌లో వివరించారు. తన భార్యను చంపేయమని ధర్మరాజు తన పనోడికి చెప్తాడని చెప్పారు. ‘పొడిచి పొడిచి చంపడం కాదురా.. ఒకే దెబ్బ ఫసక్’ అని సినిమాలో డైలాగ్ ఉంటుందని మోహన్‌బాబు ఎడమ చేతితో సైగ చేస్తూ చెప్పారు. ఆ మూడక్షరాల మాట ఇప్పుడు తెలుగు నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది. ఈ మాట మీద వందలకొద్దీ మీమ్స్, స్పూఫ్‌లు పుట్టుకొచ్చేశాయి. రకరకాల వీడియాలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా డైలాగులో భాగంగా యథాలాపంగా తను పలికిన ఆ ఒక మాట ఇంత వేగంగా వైరల్ కావడంతో మోహన్‌బాబు కూడా ముగ్ధుడయ్యారు. ‘‘#fasak ఇది ట్రెండ్ అవుతోందని తెలుసుకుని చాలా సంతోషించాను. నేను వాడిన మాటను ఉపయోగించి దాదాపు 200 స్పూఫ్‌ వీడియోలు వచ్చాయని విష్ణు చెప్పాడు. కొన్ని చూశాను. చాలా ఇన్నోవేటివ్‌గా, ఫన్నీగా ఉన్నాయి’ అని మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. అయితే ఇంతలా ట్రోల్ చేస్తున్నా మోహన్‌బాబు సరదాగా ట్వీట్ చేయడంపై ట్రోల్ రాజాలు షాక్‌కు గురవుతున్నారు.