చివరి చూపుకు నువ్వు తప్పక రావాలి

SMTV Desk 2018-09-04 13:59:26  pawan kalyan, Pawan kalyan fan suicide

విజయవాడ : సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడకు చెందిన కొమురవెల్లి అనిల్ కుమార్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని తల్ వాకర్స్ జిమ్ లో ట్రైనర్ గా అనిల్ పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా అతడు డిప్రెషన్ లో ఉన్నట్టు తెలిసింది. చనిపోయేముందు పవన్ కళ్యాణ్ కు అనిల్ ఓ లేఖ రాశారు. దీన్ని అయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్, తాను చనిపోయిన తర్వాత చూడటానికి రావాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే తన అంత్యక్రియలు పవన్ కళ్యాణ్ చేతులమీదుగా జరగాలని ఆకాంక్షించారు. ఆయన తప్పకుండా వస్తారని విశ్వాసం వ్యక్తం చేసారు.