చిన్నారికి కిన్స్ బోర్న్ సిండ్రోంమ్

SMTV Desk 2017-07-17 17:53:54  one,year,ald,bady,girl,guntur,dancing,syndrome,

కోటి మంది పిల్లల్లో ఒక్కరికి ఇలాంటి అరుదైన వ్యాధి జీజీహెచ్ న్యూరాజీ వైద్యుల వెల్లడి గుంటూరు, జూలై 17 : నగరంలో పాత గుంటూరు ఆంజనేయస్వామి గుడివీధికి చెందిన చిచ్చుల సూర్యపవన్, శ్రీలక్ష్మి దంపతులు ఉద్యోగం నిమిత్తం ఉంతున్నారు. కుటుంబం సబ్యులతో గడిపేందుకు గుంటూరుకు వచ్చారు. వీరికి జన్మించిన ఏడాది వయసున్న నవ్య అనే పాప 2 వారాల క్రితం ఇంట్లో మంచంపై నుంచి కిందకి పడిపోయింది. దీంతో మెడ వంకర పోవడం తో కంగారు పడిన తల్లిదండ్రులు పైవేటు ఆస్పత్రిలోని పిల్లల వైద్యుల వద్దకు వెళ్లారు. పిల్లల వైద్య నిపుణులు సీటీ స్నాన్ పరీక్ష చేసి న్యూరాలజీ సమస్యగా భావించి సంభందిత విభాగ వైద్యులను సంప్రదించాలని సూచించారు. దీంతో శుక్రవారం శ్రీలక్షీ, సూర్యపవన్ తమ బిడ్డను గుంటూరులో జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగంలో అడ్మిట్ చేశారు. బిడ్డకు పరీక్ష చేసి బిడ్డకు కిన్స్ బోర్న్ సిండ్రోంమ్ గా నిర్ధారించినట్లు కోటి మంది పిల్లల్లో ఒక్కరికి ఇలాంటి అరుదైన వ్యాధి వస్తుందని ఈ వ్యాధి 6 నుంచి 36 నెలల వయసున్న పిల్లలకు వస్తుందని చెప్పారు. కళ్ళు డ్యాన్స్ చేస్తుంటాయని,శరీరం మొత్తం షేక్ అవుతూ ఉంటుందని, కూర్చోలేకపోవడం ,నిలబడలేకపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. గతంలో కూడా ఇలాంటి కేసులను గుర్తించమని డాక్టర్ సుందరాచారి తెలిపారు. ఈ వ్యాధికి వైద్యం చాల ఖర్చుతో కూడుకున్న విషయంమని వైద్యులు తెలిపారు నవ్య తండ్రి సూర్యపవన్ తమ బిడ్డకు వైద్యం కోసం దాతలెవరైనా ముందుకొచ్చి తమకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.