అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ

SMTV Desk 2018-09-04 12:07:07  Mega DSC, Uttam Kumar reddy

* 20 వేల ఉపాద్యాయ పోస్టులు భర్తీ చేస్తాం * నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతికి కట్టుబడి ఉన్నాం రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే .. వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి 20 వేల ఉపధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించాడు. తొలి ఏడాది ప్రభుత్వ సంస్టల్లో లక్ష ఉద్యోగాలు, ప్రైవేటులో మరో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు మూడువేల రూపాయల చొప్పున భృతికి కట్టుబడి ఉన్నామని అన్నారు. ఉద్యోగాలిచ్చే టీఎస్ పీఏస్సీలోనే 300 ఖాళీలు ఉన్నాయని ఏద్దేవ చేసారు. టీఎస్ పీఏస్సీలో దాదాపు 19 లక్షల మంది నిరుద్యోగులు నమోదు చేసుకున్నారని అన్నారు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు అద్దం పడుతోందన్నారు. తెలంగాణ యువత కేసీఆర్ పై మండిపడుతున్నారని.. ఎన్నికలు ఎప్పుడొచ్చిన కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమన్నారు. ఉద్యోగాల నియామకానికి సంబందించి ఉద్యమ సమయంలో కేసీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను ఈ సందర్భంగా ప్రదర్శించారు