సినిమాలో నటించనున్న పీవీ సింధు

SMTV Desk 2017-07-17 17:35:14  PV Sindhu, to, star, in, the, film

న్యూయార్క్, జూలై 17 : భారత బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు జీవితం సినిమాగా రాబోతుంది. నటుడు సోనుసూద్ పీవీ సింధు జీవితం ఆధారంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఐఫా అవార్డులో పాల్గొనేందుకు వెళ్ళిన సోనుసూద్ ఈ విషయం తెలిపారు. 'ఒలంపిక్స్ లో రెండు రజత పతకాలు సాధించి అందరికి ఆదర్శంగా నిలిచిన సింధు జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నట్లు చెప్పారు. ఇందులో సింధునే నటిస్తుందని ఆయన అన్నారు. ఒక ప్రధాన పాత్రలో దీపిక పడుకునే కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనికి స్పందించిన సోనుసూద్ ఈ చిత్రంలో దీపిక కూడా ఒక భాగస్వామిగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా ఇతర నటీనటుల కోసం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ తుది దశకు చేరుకుంది. ఇందులో నేను కూడా ఒక పాత్రలో నటిస్తున్నాను' అని ఆయన అన్నారు.