తెలంగాణ కేబినెట్ భేటీ ఆ రోజే

SMTV Desk 2018-09-01 12:52:35  Telangana Cabinet Meeting, kcr

రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్ర కేబినేట్ భేటీ కానుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గం సమావేశం కానుంది. రేపు జరగబోయే ప్రగతి నివేదన సభలో మాట్లాడాల్సిన అంశాలపై సీఎం మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.అదే రోజు సాయంత్రం ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.సీఎం ప్రకటించబోయే వరాలకు కేబినెట్‌ నుంచి ఆమోదం తీసుకుంటారు. ఈ సమావేశంలో వరాల కన్నా ముందస్తుపైనే ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉంది. వేతన సవరణ కమిషన్‌ ఇచ్చిన మధ్యంతర నివేదికను మంత్రివర్గం ఆమోదించి మధ్యంతర భృతిపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. దాంతోపాటు 31 కులాలకు సామాజిక భవనాలు కట్టడానికి వీలుగా 61.30 ఎకరాల స్థలాన్ని కేటాయించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.