ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు

SMTV Desk 2018-08-30 16:51:52  Nandamuri Harikrishna, KCR,

మాజీ మంత్రి, నటుడు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. హరికృష్ణ చితికి ఆయన రెండో కుమారుడు కల్యాణ్ రామ్ నిప్పంటించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జయకృష్ణ, బాలకృష్ణ, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని పాడె మోశారు. అంతిమయాత్రలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. కడసారి చూపుకోసం అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హరికృష్ణ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఏపీ, తెలంగాణ మంత్రులు హాజరయ్యారు.