వాట్సాప్‌ కు పోటీగా...

SMTV Desk 2017-07-17 16:32:06  WHATS APP, VIBER, MESSENGER, AMAZON, APP, PHONE NUMBER, E-COMMERS, EMOJI, JIP MESSEGES ANY TIME.

జూలై 17 : హైక్‌ మెసెంజర్, వైబర్, వియ్ చాట్ వంటి ఎన్ని మెసెంజర్ లు వచ్చిన వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపేది వాట్సాప్‌ వైపే. కాని ఇప్పుడు వాట్సాప్‌ కు పోటీగా మరో కొత్త యాప్ రానుంది. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, ‘ఎనీటైమ్‌’ పేరిట దీన్ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. అంతకుముందు తన సంస్థ వ్యాపార వినియోగదారుల కోసం ‘చైమ్‌’ అనే యాప్‌ను రూపొందించగా... తాజాగా ఇప్పుడు వినియోగదారులందరి కోసం మరో కొత్త యాప్ ను తీసుకురానుంది. వాట్సాప్‌ తరహాలో ఈ యాప్‌లో కూడా చాట్‌ చేసుకోవడంతో పాటు, ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే సదుపాయం ఉండబోతోంది. అంతేకాకుండా వీడియోలు, ఎమోజీలు, స్టిక్కర్లు, జిఫ్‌ ఇమేజ్‌లను కూడా పంపుకోవచ్చు. ఫోన్‌ నంబరుతో సంబంధం లేకుండా పేర్ల ద్వారా స్నేహితులతో అనుసంధానం అవ్వొచ్చు. అటు మొబైల్‌తో పాటు, డెస్క్‌టాప్‌లోనూ పనిచేసే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. త్వరలోనే దీన్ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చేందుకు అమెజాన్‌ సన్నద్ధమవుతోంది.