కుటుంబం సహా నగల వ్యాపారి ఆత్మహత్య

SMTV Desk 2017-07-17 16:20:27  familey,sucide,karnataka,

బనశంకరి, జూలై 15 : (కర్నాటక): ఉడుపి జిల్లాకేంద్రం తాలూకాలోని పడుబెళ్లికి చెందిన శంకర్ఆచార్య (50),చాలాకాలంగా పదుబెళ్లిలో శ్రేయాస్ జ్యువేలర్స్ పేరుతో ఆభరణాలు వ్యాపారాన్ని నిర్వహిస్తుండేవారు. కొంతకాలంగా వ్యాపారంలో తీవ్రనష్టాలు రావడంతో పాటు వ్యాపారం కోసం తీసుకున్న అప్పులు భారీగా పేరుకుపోవడంతో రుణదాతల ఒత్తిళ్ల తీవ్రత ఎక్కువైయింది. అప్పులు తీర్చే మార్గం కానరాక శంకర్ తన భార్య నిర్మల(45), కుమార్తెలు శ్రేయా (23), శృతి (22) లతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బుధవారం రాత్రి సైనేడ్‌ కలిపిన ఆహారాన్ని తిని ప్రాణాలు వదిలారు. గురువారం బంధువులు శంకర్ కు ఫోన్ చేస్తే ఎత్తక పోవడంతో అనుమానంతో ఇంటికి వచ్చి చూసారు. కుటుంబం మొత్తం విగత జీవులుగా కనిపించారు. బంధువుల ఫిర్యాదు మేరకు శిర్వ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.