99.3శాతం రద్దయిన నోట్లు వెనక్కి

SMTV Desk 2018-08-29 15:45:13  Demonitisation, RBI,

రద్దయిన పెద్దనోట్లు 99.30 శాతం వెనక్కి వచ్చేశాయని ఆర్బీఐ తన వార్షిక నివేదిక ద్వారా ప్రకటించింది. దాదాపు 21నెలల తర్వాత పాతనోట్ల లెక్కింపు ముగిసినట్లు ఆర్‌బీఐ బుధవారం (ఆగస్టు 29) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.‘2016, నవంబరు 8 ముందు వరకు రూ.15.41లక్షల కోట్ల 500, 1000నోట్లు చెలామణీలో ఉన్నాయి. ఇప్పటి వరకూ రూ.15.31లక్షల కోట్ల రద్దయిన నోట్లు బ్యాంకుల ద్వారా వెనక్కి వచ్చాయి. బ్యాంకులకు వచ్చిన రద్దయిన నోట్ల లెక్కింపు విజయవంతంగా ముగిసింది. వీటి లెక్కింపు కోసం ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాం’ అని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.