అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు: సీఎం కేసీఆర్ ఆదేశాలు

SMTV Desk 2018-08-29 14:15:48  Hari Krishna, CM kCr, last rights

సినీ నటుడు, మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు.. అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. హరికృష్ణ కుటుంబసభ్యులతో మాట్లాడి, అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇవాళ ఉదయం 6.15 గంటలకు నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి వద్ద రోడ్డుప్రమాదంలో హరికృష్ణ మృతి చెందిన విషయం విదితమే. రేపు మొయినాబాద్ మండలంలోని ముర్తుజగూడలోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.