ఏషియాడ్: సిల్వర్ తో సరిపెట్టుకున్న సింధూ

SMTV Desk 2018-08-28 13:17:42  PV Sindhu, ASian Games,

ఏషియన్ గేమ్స్ -2018 బ్యాడ్మింటన్ ఫైనల్ లో స్టార్ ఇండియన్ షట్లర్ పీవీ సింధూ ఓడిపోయింది. మంగళవారం(ఆగస్టు-28) జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ నెం.1 తాయ్ తుజు ఇంగ్ పై 13-21, 16-21 తేడాతో ఓడిపోయి సిల్వర్ తో సరిపెట్టుకుంది సింధూ. అయితే ఓడినా ఆమె చరిత్ర సృష్టించింది. ఏషియన్ గేమ్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు నిలిచింది. ఇంతకుముందు సైనా నెహ్వాల్ సెమీస్‌లోనే ఓడి బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫైనల్ ఫోబియా కొనసాగిన వేళ.. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సింధు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.