పవన్ కళ్యాణ్ పుట్టినరోజున చెర్రీ సర్ ప్రైస్ ..?

SMTV Desk 2018-08-27 19:59:47  ramchran,tollywood,pawankalyan,teaser, sairanrasimhareddy

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌-మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది.డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎల్‌ఎల్‌పీ బ్యానర్లపై దానయ్య, పార్వతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిరంజీవి పుట్టినరోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారట. కానీ ఆ సమయంలో చిరు నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌ను విడుదల చేశారు. ఇక చెర్రీ సినిమా లుక్‌ను విడుదల చేసే అవకాశం కుదరకపోవడంతో దీంతో రానున్నసెప్టెంబర్‌ 2న పవన్‌ కల్యాణ్‌ తన పుట్టినరోజు సందర్బంగా చెర్రీ తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుదల చేస్తారని టాలీవుడ్ లో గుసగుసలు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అడ్వాణీ నటిస్తున్నారు. నటుడు ఆర్యన్‌ రాజేశ్‌ చరణ్‌లు అన్నదమ్ముల పాత్రల్లో కన్పించనున్నారట. బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు టాక్ వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క రామ్‌చరణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ కూడా సంక్రాంతికే విడుదల కాబోతోంది. మరి చెర్రీ తండ్రి కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకుంటారా? లేక మెగా అభిమానులకు డబుల్‌ బొనాంజా ఇస్తారా? అన్నది వేచిచూడాలి.