మెడికల్ విద్యార్ధి పై కత్తితో దాడి....

SMTV Desk 2017-07-17 14:28:58  indian,medical,student,stab,bangladesh

ఢాకా,జూలై 17 : బంగ్లాదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ భారతీయ మెడికల్ విద్యార్ధి అతీఫ్ అతడు చిట్టగాంగ్ పైవేట్ యునివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో పైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతీఫ్ షేక్ అనే మెడికల్ విద్యార్ధి విన్సన్‌ మెయిస్నామ్ సింగ్ (23) అనే వ్యక్తితో కలిసి ఢాకాలోని అక్బర్ షా ప్రాంతంలోని ఓ 6 అంతస్థుల భవనంలో నివసిస్తున్నారు. తొలుత మెయిస్నామ్, ఆతీష్ ల మద్య గొడవ ప్రారంభమై అనంతరం కత్తి పొట్ల వరకు దారి తీసింది. అయితే వీరితో పాటు మరో ఇద్దరు కూడా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వారిలో ఒక యువతి కూడా ఉన్నారని తెలిసింది. వీరంతా కూడా మణిపూర్ కు చెందిన వారని వెల్లడించారు. కత్తితో దాడి చేసిన అనంతరం సింగ్ ఉరేసుకునేందుకు ప్రయత్నించగా వెంటనే అప్రమత్తమైన తోటీ విద్యార్థులు ఇద్దరు అతడిని అడ్డుకున్నారు, కత్తి పోట్లకు గురైన అతీఫ్ ను అస్ప్రత్రికి తరలించగా మార్గం మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.