చరిత్ర సృష్టించిన పీవీ సింధు

SMTV Desk 2018-08-27 13:24:14  ASian Games, PV Sindhu,

పీవీ సింధు ఆసియా క్రీడల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో ప్రవేశించింది.జపాన్‌కు చెందిన అకానె యమగూచిపై విజయం సాధించడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా సింధు రికార్డు సృష్టించింది.. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సింధు, ఆసియా క్రీడల్లో రజత పతకం ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్ షట్లర్ యమగుచితో జరిగిన పోరులో సింధు అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో సింధు 21-17, 15-21, 21-10 తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఫైనల్ లో సింధు వరల్డ్ నంబర్ వన్, చైనీస్ తైపీ షట్లర్ జూ యింగ్ తై తో తలపడనున్నది.